వరుడి కోసం ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది!

Thursday, May 3rd, 2018, 06:42:49 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ కావడంతో కొందరు దానిని దుర్వినియోగం చేస్తుంటే, మరికొందరు మాత్రం దానిని సరిగా ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. విషయంలోకి వెళితే కేరళ కు చెందిన 28 ఏళ్ళ జ్యోతి తనకు వరుడు కావాలని పేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం పెద్ద వైరల్ గా మారింది. నేను బిఎస్సి లో ఫాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసాను. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాను. నా తల్లితండ్రులు మరణించారు. ఒక అన్నయ్య వున్నాడు, అతను ముంబై లో సీనియర్ యాడ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు, నాకు కులం, జాతి, వర్గం పట్టింపులేదు.

మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అంటూ మలయాళంలో ఒక పోస్ట్ చేసింది. అయితే ఆమె పేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కు కూడా ఒక పోస్ట్ చేసింది. మాట్రిమోనియాల్ వెబ్ సైట్ ల వల్ల డబ్బు నష్టపోవడమే కాక, అందులో మధ్యవర్తుల వల్ల యువతీ యువకులు సరైన భాగస్వాములను ఎంచుకోలేకపోతున్నారు. కావున మీరు పేస్ బుక్ లో మాట్రిమోనీ ఫీచర్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయమని కోరింది. కాగా ఆమె చేసిన ఆ పోస్ట్ ను ఇప్పటివరకు దాదాపు ఆరువేల మందికి పైగా షేర్ చేశారు.

కాగా ఈమె లానే ఇదివరకు ఇదే కేరళకు చెందిన రంజిష్ మంజేరి అనే ఫోటోగ్రాఫర్ కూడా తనకు వధువు కావాలని పేస్ బుక్ లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి జ్యోతి చేసిన ఈ ప్రయత్నం మంచిదేనని, ఒకవేళ ఫేస్బుక్ లో మాట్రిమోనీకి సంబందించిన ఫీచర్ ఉంటే బాగుంటుందని పలువురు యువతీ యువకులు కామెంట్స్ చేస్తున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments