కుక్కలకోసం తన బ్రతుకు ముక్కలు చేసుకుంది !

Wednesday, June 13th, 2018, 06:39:56 PM IST

మనలో చాలామంది పెంపుడు జంతువులపై యెనలేని మమకారం పెంచుకునేవారున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఒక మహిళ మాత్రం ఏకంగా తన భర్తతో హాయిగా గడపవలసిన జీవితాన్ని వదులుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే, లండన్ లో నివసించే 49ఏళ్ళ వయసుగల లిజ్ కు దాదాపు 25ఏళ్ళ క్రితం మైక్ తో వివాహమైంది. అయితే స్వతహాగా జంతుప్రేమికురాలయిన లిజ్ పెళ్లి తరువాత తమ ఇంటిని పెంపుడు కుక్కలతో నింపేసింది. కాగా మైక్ కు మాత్రం కుక్కలంటే అస్సలు నచ్చదు. ఇదే ఆమె జీవితాన్ని ముక్కలు చేసేలా చేసింది. ఎన్నేళ్ళనుండో కుక్కలతో లిజ్ తో కలిసి గడుపుతున్న మైక్ తట్టుకోలేక చివరకు కొద్దిరోజుల క్రితం నీకు నేను కావాలో ఆ కుక్కలు కావాలో తేల్చుకోమనడంతో,

అతని ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని ఆమె, తనకు పెంపుడు కుక్కలే కావాలని బదులిచ్చింది. అంతే వెంటనే మైక్ ఆమెనుండి విడిపోయి ఇంటినుండివెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆమె ఇంట్లో 30 కుక్కలు ఉన్నాయని, వాటిలో ఐదు కుక్కలకు చెముడు మరియు రెండు కుక్కలకు ఒక కన్ను మాత్రమే కనపడుతుందని, మరికొన్నిఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నాయని చెప్పింది. వాటికోసం తన పాతికేళ్ల జీవితాన్ని వదులుకున్నందుకు బాధలేదని, కానీ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాటిని వదిలివేయడం కుదరదని, నిజానికి తన తండ్రి ఆహరం తయారుచేసే సంస్థలో పనిచేసేవారిని అప్పటినుండి తనకు మూగ జీవులపై ప్రేమ ఏర్పడిందని లిజ్ చెప్పుకొచ్చింది……

  •  
  •  
  •  
  •  

Comments