బాయ్ ఫ్రెండ్ తో లాడ్జిలో ఎంజాయిమెంట్…డ్రగ్స్ ఎక్కువై పైకి అప్పాయింట్మెంట్!

Friday, April 13th, 2018, 06:51:38 PM IST

ఇటీవల ఒక వివాహిత మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గడపడంకోసం అతిగా డ్రగ్స్ సేవించి మృత్యువాత పడింది. ఆ ఘటనతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా వులిక్కిపడ్డారు. విషయంలోకి వెళితే, మహారాష్ట్రలోని భీవండి ప్రాంతంలో ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత, ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే అతడు అప్పుడపుడు ఆమెను కలుస్తుండేవాడు. కాగా ఒకరోజు ఇద్దరూకలిసి ఎంజాయ్ చేద్దామని ముంబై లోని ఒక లాడ్జి లో రూమ్ బుక్ చేశారు. అంతేకాక ఆరోజు ఇద్దరు అతిగా మద్యం సేవించారు. ఆ పై లైంగిక ఆనందంకోసం ఆ మహిళ డ్రగ్స్ కూడా సేవించడం వల్ల స్పృహ కోల్పోయింది. అయితే ఆమెను ఎంత సేపు లేపినప్పటికీ లేవకపోవడంతో భయపడ్డ ప్రియుడు ఆమెను వదిలి పారిపోయాడు.

ఆ తరువాత రూమ్ సర్వీస్ నిమిత్తం బాయ్ ఎన్ని సార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా, వారు గది తలుపులు పగులగొట్టి చూస్తే అప్పటికే అపస్మారక స్థితిలో పడి వుంది మహిళ. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. అయితే ఆ ఘటన పై ఆ మహిళ తండ్రి మాట్లాడుతూ ఆమెకు డ్రగ్స్ భర్త ద్వారానే అలవాటు అయ్యాయని, అందువల్లనే ఇంతటి ఘోరం జరిగిందని విలపిస్తూ తెలిపాడు. కాగా ఘటన అనంతరం ఆమె ప్రియుడు పరారవడంతో అతన్ని పట్టుకుని అసలు నిజాన్ని కనుక్కునేందుకు పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు….