సైలెంట్ గా మొదలెట్టిన కమ్ముల..!

Tuesday, November 13th, 2018, 11:00:43 AM IST

ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 16నెలలు ఖాళీగా ఉన్న శేఖర్ కమ్ముల, చడీ చప్పుడు లేకుండా తన తరువాతి సినిమాను ప్రారంభించాడు. సోమవారం ఉదయం చిన్న పూజ కార్యక్రమంతో సినిమా షూటింగ్ ప్రారంబించాడు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడట, నిర్మాతగా కొత్తేమో కానీ, అతను సినిమా రంగానికి చెందిన బడా బాబే అంటున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట,డిస్ట్రిబ్యూషన్ కూడా పెద్ద రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడట. ఈయన మహేష్ బాబు తో కలిసి కొన్ని మల్టి ప్లెక్స్ లు కూడా కడుతున్నారట. అలంటి వ్యక్తి సొంతంగా సినిమా చేస్తూ ఏ హడావిడి లేకుండా ప్రారంభించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందరూ కొత్తవాల్లే నటిస్తున్నారట. హ్యాపీడేస్ తరహాలో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఏదేమైనా లై ఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక లాంటి డిసాస్టర్ సినిమాల తర్వాత ఫిదాతో మళ్లీ తన సత్తా చాటిన శేఖర్ కమ్ముల, చాలా మంది నిర్మాతలు తనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్న కూడా 16 నెలలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం అయితే, ఒక బడా నిర్మాతతో సినిమా తీస్తున్నప్పటికీ ఏ హడావిడి లేకుండా స్టార్ట్ చేయటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది.