హార్థిక్ పాండ్య మాయలో ఇద్దరు ముద్దు గుమ్మలు..?

Saturday, September 23rd, 2017, 03:37:16 PM IST


టీం ఇండియా యువ సంచలనం హార్థిక్ పాండ్య ఆటలో ఎంత ఎదుగుతున్నాడో అతడి చుట్టూ అంతే స్థాయిలో రూమర్లు కూడా పెరుగుతున్నాయి. క్రికెట్ లో స్టార్ గా మారుతుండడం, చురుకైన యువకుడిగా ఉండడంతో సాధారణంగానే పాండ్యపై యువతుల కన్ను పడే అవకాశం ఉంది. కానీ ఏకంగా ఇద్దరు బాలీవుడ్ భామలు పాండ్య మాయలో పడ్డట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. పరిణితి చోప్రా పాండ్యతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు గతంలో వచ్చాయి.

తాజాగా మరో భామ పాండ్య ప్రేమలో పడ్డట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన ఘాటు ఫోజులతో సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేసే శిబాని దండేకర్ పాండ్య ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ వార్తలపై పాండ్య తండ్రి హిమాంశు పాండ్య స్పందించారు. నవ్వుతూ.. హార్థిక్ పాండ్య పై అమ్మాయిలకు ఆసక్తి ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదు. బహుశా అతడి ఆట తీరు వలెనే ఇలా జరిగి ఉండొచ్చు అని అన్నారు. దీనిని సరదాగా చమత్కరించారు. ఇదేమి పెద్ద సమస్య కాదు. చాలా మంది క్రికెటర్ లకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అమ్మాయిల కారణంగా క్రికెట్ పై పాండ్య ఫోకస్ తగ్గదు. న కొడుకు దృడంగా ఉంటాడు అని అన్నారు.

Comments