మా విన్నింగ్ ఫార్ములా అదే :శిఖర్ ధావన్

Wednesday, February 7th, 2018, 02:48:46 PM IST

సఫారీ పర్యటనలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు పుంజుకొని వన్డే సిరీస్ విను గెలుచుకునేందుకు ప్రయత్నాలను చేస్తోంది. మొదటి రెండు వన్డేలో మంచి విజయాన్ని అందుకున్న కోహ్లీ సేన నెక్స్ట్ వన్డేలలో కూడా అదే తరహాలో తన సత్తాను చాటాలను అనుకుంటోంది. అయితే ఆ రెండు వన్డేలను గెలవడానికి ఒక మంచి ఫార్ములాను ఉపయోగించమని అందుకే ఈజీగా గెలిచామని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పాడు. ఆ విజయ రహస్యం ఏమిటంటే.. దక్షిణాఫ్రికా జట్టు సొంత గడ్డపై బంతులను ఎలా వేయాలనే విధానంపై పట్టు చాలా ఉంది.

ఏ సమయంలో స్పీడ్ బంతులను వేయాలి. అలాగే ఎప్పుడు స్లో బంతులను వేయాలి అనే విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే మేము కూడా ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించం. మొదటి 10 ఓవర్లు వికెట్లు పడకుండా ఆపగలిగి, బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటే బాల్ కాస్త పాతబడుతుంది. ఆ తరువాత పరుగులను రాబట్టడానికి ఈజీ అవుతుందని ధావన్ విజయ రహస్యాన్ని వివరించాడు. జట్టులో ఎలాంటి ప్రయోగం చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని కూడా ఈ బ్యాట్స్ మెన్ తెలిపాడు.