మూడు రోజుల్లో షిరిడి సాయి నాధుని యొక్క హుండీ ఆదాయం 5.9 కోట్లు.!

Monday, October 22nd, 2018, 01:12:47 PM IST

మన భారతదేశ చరిత్రను చూసుకుంటే ఎన్నో మహా పుణ్య క్షేత్రాలు,ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన వాటిలో తిరుమలేషుని తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి మరియు ఆ తర్వాత అంత ఆదరణ పొందిన మరో పుణ్య క్షేత్రం మహారాష్ట్ర లోని శ్రీ షిరిడి సాయి నాధుని అతి పవిత్రమైన పుణ్య క్షేత్రం.కలియుగం లోని సర్వ మతాల సమ్మేళన మిళితంగా బాబాను భక్తులు కొలుచుకుంటారు.షిరిడి దేవస్థానానికి కుల,మత,ప్రాంత లాంటి విభేదాలు ఏమి లేవు.అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి తరలి వస్తారు.

అయితే ఈ నెల 18వ తారిఖుతో ఆ సాయి నాధుడు తన పవిత్ర సమాధి లోకి చేరి వంద ఏళ్ళు గడిచాయి.దీనితో షిరిడి లోని ఆ రోజును ఒక మహా పర్వదినంగా నిర్వహించారు.దానితో షిరిడీకి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు.ఈ గడిచిన మూడు రోజుల్లోనే భక్తులు అధిక మొత్తంలో రావడం వలన అక్కడ కేవలం ఆ మూడు రోజుల్లోనే దగ్గరకు 6 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టుగా ఆలయ నిర్వాహకులు తెలియజేసారు.ఆ ధనాన్ని పేద వారికి ఉపయోగ పడే విధంగా పాఠశాలలను మరియు కళాశాలలను నిర్మించడానికి వినియోగిస్తే మంచిదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments