సల్మాన్ విడుదలపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

Sunday, April 8th, 2018, 03:00:32 AM IST

ప్రతిసారి వివాదాలకు దారి తీసేందుకు పాకిస్తాన్ క్రికెటర్లు కాలు దువ్వుతారని అందరికి తెలిసిందే. మాజీ క్రికెటర్స్ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పరోక్షంగా భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల షాహిద్ ఆఫ్రిది కాశ్మీర్ పై కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మన క్రికెటర్లు అప్పుడే అతనికి కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే ఈ రోజు సల్మాన్ ఖాన్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఎట్టకేలకు సల్మాన్ కు బెయిల్ దొరికింది. అలాగే నా జీవితంలో
కశ్మీర్‌, పాలస్తీనా, యెమెన్, ఆప్ఘనిస్థాన్‌ వంటి సమస్యాత్మక ప్రాంతాలకు కూడా స్వేచ్ఛా స్వతంత్రం వచ్చింది అనే శుభవార్త వినాలని ఉంది. ఎందుకంటే మానవత్వం లేకుండా ప్రవర్తించడం అలాగే అమాయకుల ప్రాణాలు తీయడం వంటి ఘటనలు తన గుండెని బాధపెడుతూ పిండేస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా షోయబ్ అక్తర్ తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments