వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ వంగవీటి శ్రీనివాస్ మరియు తదితరుల రాజీనామా..!

Monday, September 17th, 2018, 08:20:19 PM IST

వైసీపీ విజయవాడ సెంట్రల్ టికెట్ ఎవరికీ ఇవ్వాలి అన్న నేపధ్యంలో వైసీపీ నేతలు ముమ్మరంగా రాజీనామా బాట పట్టారు దీనికి కారణం వైసీపీ పార్టీకి చెందిన వంగవీటి రాధా గారికి ఇవ్వకుండా వేరే వాళ్లకి ఇచ్చారన్న నేపథ్యంలో అక్కడి వంగవీటి అభిమానులు కాస్త మనస్తాపానికి గురి అయ్యారు. దీనితో వంగవీటి ప్రసాద్ వైసీపీ పార్టీకి మరియు ఉయ్యూరు కౌన్సిల్ జిల్లా ప్లోర్ లీడర్ పదవులకు రాజీనామా చేసినట్టు తెలిపారు.వైసీపీ పార్టీకి ఎప్పటి నుంచో వారికి బలోపేతంగా ఉంటున్న రాధ గారికి విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు ఇవ్వకుండా వేరే నియోజకవర్గానికి పంపడానికి వైసీపీ వారు కుట్రపన్నుతున్నారు అని అక్కడి రాధ గారి అభిమానులు తెలుపుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్నటువంటి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యి అతను మరియు అతని సహచరులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.దీనిపై శ్రీనివాస ప్రసాద్ గారు విలేఖరులతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి వారి పార్టీలో కొంత మంది చెప్పుడు మాటలను విని వారి పార్టీలోని టిక్కెట్లను అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.అందుకనే తాను మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు వంగవీటి మోహన్ రంగా గారికి ఉన్న స్నేహ బంధం మూలంగానే జగన్ వంగవీటి రాధా గారిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించినందున వారు చేరారని,కానీ ఇప్పుడు వారి పార్టీ శ్రేణుల వంగవీటి రాధా గారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని,రాజీనామా నాతో మొదలయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి వంగవీటి రంగా మరియు రాధా గారి అభిమానులు అందరూ వైసీపీ పార్టీ నుంచి తప్పుకుంటారని,తెలిపి జగన్ తీరు పట్ల మండిపడ్డారు.