బయటపడ్డ సాధినేని యామిని అసలు రంగు..బాబుకే వెన్నుపోటు.?

Friday, March 15th, 2019, 02:42:24 PM IST

టీడీపీలో అతి తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా మారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహిళా నేత ఎవరన్నా ఉన్నారు అంటే అది సాధినేని యామినీ అనే చెప్పాలి.ఆమె అనర్గళంగా మాట్లాడే తీరు వలన తెలుగుదేశం అధిష్టానం ఆమెని ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పెట్టుకుంది.అయితే సాధినేని యామినీకి మాత్రం అది సరిపోలేదు అనిపించింది ఏమో..ఏకంగా ఎమ్మెల్యే సీటుపై కన్నేసినట్టుంది.నిన్ననే కూడా యామిని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉందని కూడా వార్తలొచ్చాయి.

ఇది వరకు ఈమెకు చంద్రబాబు అన్నా వారి పార్టీ అన్నా ఇంత గౌరవం ఉందా అనే విధంగా ఈమె మాటలు ఉండేవి.కానీ ఇప్పుడు ఈమె అసలు రంగు ఏమిటో బయట పడింది.చంద్రబాబు రానున్న ఎన్నికల్లో సీటు ప్రకటించబోయేది తమ అభిమాన అభ్యర్థి కాదని తెలిసి గత కొన్ని రోజులుగా చంద్రబాబు నివాసం వద్ద అసంతృప్తులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.దీనినే సాధినేని యామిని అదునుగా తీసుకొని మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి ఇప్పుడు లీకయ్యింది.

నియోజకవర్గాల వారీగా చాలా మంది చంద్రబాబు ఇంటి దగ్గర ఫలానా వారికి సీటివ్వండి,ఫలానా వారికి సీటివ్వకండి అని చెప్తున్నారు.ఈ విషయాన్ని మీడియా కూడా బాగా హైలైట్ చేస్తున్నారు.అలాగే మనవాళ్ళు కూడా బ్రాహ్మణులకు సీటివ్వాలి అని ఒక 20-30 మంది వెళ్ళండి అని తన అనుచరులను ఉసిగొల్పుతున్న ఆడియో టేప్ లీకయ్యింది.దీనితో సాధినేని యామిని ఆఖరికి చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచిందని సోషల్ మీడియాలో ఇతర పార్టీ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.