జనసేన ప్రతిష్టకు ఆదిలోనే దెబ్బ..?

Sunday, October 22nd, 2017, 09:43:09 AM IST

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఎటువంటి మచ్చ లేదు. మంచి మనిషిగా, సాయం చేసే గుణం ఉన్న వ్యక్తిగా, సమస్యలపై ధైర్యంగా పోరాడగలిగే నాయకుడిగా పవన్ కు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. జనసేన పార్టీకి కలసి వచ్చే అంశాలు ఇవే. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఇప్పడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో పార్టీ ప్రతిష్ట భంగం కలిగేలా ఓ ఘటన జరిగింది.

జనసేన పార్టీ నాయకుడిగా, మంచి వక్త గా చెప్ప బడుతున్న కళ్యాణ్ సుంకర ఓ కేసులో చిక్కుకున్నారు. ఓ యువతికి ఐఫోన్ పేరుతో డమ్మీ మొబైల్ ని అమ్మిన కేసులో కళ్యాణ్ చిక్కుకున్నారు. కేవలం 16 రోజులు మాత్రమే వాడిన ఐఫోన్ 7 పేరుతో పాడైన మొబైల్ ని ఓ యువతికి 44 వేలకు అమ్మాడు. కానీ ఆ ఫోన్ పాడై పోయిందని తెలుసుకున్న తరువాత ఆ యువతి కళ్యాణ్ ని సంప్రదించింది. చిలకలగూడ పార్క్ వద్దకు వస్తే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది. కానీ కళ్యాణ్ ఆ యువతిని ఎయిర్ గన్ తో యువతిని బెదిరించడంతో ఆమె తల్లిందండ్రులు పోలీస్ లని ఆశ్రయించారు. దీనితో పోలీస్ లు కళ్యాణ్ ని అదుపులోకి తీసుకున్నారు. తాను ఓ ప్రముఖ పార్టీ అధికార పార్టీ ప్రతినిధిని అని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కళ్యాణ్ పోలీస్ లని బురిడీ కొట్టించేందుకు జనసేన పేరు వాడుకునే ప్రయత్నం చేసారు. ఈ ఘటన పై పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ జిల్లాలోనూ అధికార ప్రతినిధులని నియమించలేదు. ఇదే విషయాన్ని పవన్ పదే పదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధికార ప్రతినిధుల పేరుతో కార్యకలాపాలు చేసేవారిని అభిమానులు నమ్మ వద్దని పవన్ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments