షాకింగ్ : వైసీపీ లో కలకలం..ప్రముఖ కార్పొరేటర్ అరెస్ట్..!

Sunday, November 18th, 2018, 03:00:53 PM IST

నెల్లూరు జిల్లా వైసీపీ కార్పొరేటర్ రాజశేఖర్ అరెస్ట్ తో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. రాజశేఖర్ మరియు అతని అనుచరులు ఏపీ టూరిజం హోటల్లో తరచూ మందు పార్టీలు చేసుకునే వారు అని,ఇప్పటికే పలుమార్లు అక్కడ పార్టీలు చేసుకొని అక్కడి హోటల్ యాజమాన్యాన్ని భయబ్రాంతులకు గురి చేసేవారని తెలుస్తుంది.అయితే నిన్న రాత్రి కూడా రాజశేఖర్ ఎప్పటిలాగానే ఎక్కువ స్థాయిలోనే మద్యం పుచ్చుకొని అతను మరియు అతని అనుచరులు హోటల్ యాజమాన్యం మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు.

ఆ సీసీ టీవీ వీడియోలు కూడా బయటపడ్డాయి.ఈ గొడవ కోసం పోలీసులు దగ్గర గాని వారు బయటపెడితే చంపేస్తామని కూడా హెచ్చరించారని టూరిజం హోటల్ సిబ్బంది తెలిపారు.దీనితో వారు నెల్లూరు స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.దీనితో ఒక్కసారిగా అక్కడ వైసీపీ కార్యకర్తల్లో దుమారం చెలరేగింది.రాజశేఖర్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసు స్టేషన్ వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరి ఆందోళన చేపట్టారు.రాజశేఖర్ ను విడుదల చెయ్యాలని లేకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని వారు హెచ్చరికలు కూడా చేసినట్టు వార్తలొచ్చాయి,దీనితో అక్కడి ఎమ్మెల్యే అనీల్ వారిని బుజ్జగించి అక్కడి నుంచి వారిని పంపడంతో కాస్త పరిస్థితి మెరుగుపడినట్టు తెలుస్తుంది.