షాకింగ్ : ఫేస్ బుక్ కు 130బిలియన్ డాలర్ల లాస్!

Thursday, July 26th, 2018, 04:47:25 PM IST

సామజిక మాధ్యమాల్లో అత్యంత పేరెన్నికగన్న వాటిలో ఫేస్ బుక్ ను ఒకటిగా చెప్పుకోవచ్చు. నిరంతరం దీనిని వినియోగించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇటీవల కొద్దికాలం క్రితం ఫేస్ బుక్ లో కొందరు ఖాతాదారుల డేటా లీక్ పై కొన్ని కథనాలు వెలువడ్డాయి. కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని కస్టమర్ల డేటా ను లీక్ చేశారనే అభియోగం వచ్చింది. వాటి ప్రభావంతో అప్పట్లో ఫేస్ బుక్ అధినేత కొన్ని కోట్ల మేర ధనాన్ని, అలానే చాలామంది ఖాతాదారులను కోల్పోవలసివచ్చింది. ఆ సమయంలో కొన్ని అగ్ర కంపెనీలు సైతం తమ కంపెనీ ఫేస్ అకౌంట్ లను డిలీట్ చేసిన సందర్భాలు లేకపోలేవు. ఇక ప్రస్తుతం అదే అంశం విషయమై ఆరోపణలు ఎదురుకావడంతో ఫేస్ బుక్ కౌంటర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ ఒత్తిడితో ఒక్కసారిగా 24శాతానికి పైగా నష్టాలను చవిచూడవలసి వచ్చినట్లు మార్కెట్ అనలిస్టులు చెపుతున్నారు.

అంటే దీని ప్రకారం కేవలం రెండు గంటల్లో పేస్ బుక్ షేర్ మార్కెట్ విలువలో 130 బిలియన్ డాలర్లను కోల్పోయిందని, అంతే కాక అధినేత మార్క్ జుకెర్ బర్గ్ 16.8 వ్యక్తిగత ఆదాయాన్ని కూడా కోల్పోయారు. దీనితో నేడు ఆయనకు మరొక ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాగా ఈ క్షీణత రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. రెండవ త్రైమాసికంలో లాభాలు 31 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లు గా నమోదు కాగా, ఆదాయాలు 42 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం నెలవారీగా వినియోగిస్తున్న ఫేస్ బుక్ యూజల సంఖ్య కేవలం 11 శాతం మాత్రమే పుంజుకుందని, తద్వారా ఆదాయం 2.23 మిలియన్లుగా నమోదైందట. అయితే ఇన్వెస్టర్లు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరంలేదని, తరువాతి త్రైమాసికంలో షేర్ విలువ మరింత పుంజుకుంటుందని ఆశ భావం వ్యక్తం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments