షాకింగ్ వీడియో : రెప్పపాటులో యాక్సిడెంట్.. ఎగిరిపడినా బ్రతికారు!

Monday, February 19th, 2018, 06:53:36 PM IST

ప్రస్తుత రోజుల్లో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు వహిస్తున్నా రోడ్లపై ప్రమాదాలు తగ్గడం లేదు. అతివేగం ఎంత ప్రమాదకరమొ అని కొన్ని ఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నప్పటికీ కొంత మందికి ఇంకా అర్ధం కావడం లేదు. ఇకపోతే రీసెంట్ గా గుజరాత్ లో జరిగిన ఒక ఘటన గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే, వేగంతో వెళ్లిన ఒక జీప్ బైక్ ను ఢీకొట్టిన తీరు ఒక్కసారిగా ఆశ్చర్యపరచింది. అదృష్టవశాత్తు బాధితులకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ లోని ఒక హైవే రహదారిపై స్లోగా వెళుతోన్న మోటార్ సైకిల్ ను ఒక జీప్ వేగంతో వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బైక్ పై వెళుతోన్న ఒక మహిళ వ్యక్తి మరో చిన్నారి కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. స్థానికులు వారిని హాస్పత్రికి తరలించారు. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘటన సమీపాన ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. కిందపడిన చిన్నారి తొందరగా పైకి లేచి తల్లి దగ్గరికి రావడం అందరిని కలచివేస్తోంది.