షాకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో పలు అనుమానాలు..ఏంటవి?

Wednesday, November 7th, 2018, 04:54:47 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పై జరిగినటువంటి హత్యా యత్నం కేసు ఇంకా ఒక అంతిమ దశకు చేరుకోలేదు.ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత స్థాయి ఉండేటటువంటి వ్యక్తి పై హత్యా ప్రయత్నం జరిగితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారికేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.అయితే జగన్ మీద ఈ హత్యా ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నేతలే చెయ్యించారని వైసీపీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నారు.సామాన్య ప్రజలు చిన్న తప్పు చేసి పోలీసులకు దొరికితేనే ఎక్కడ లేని కేసులన్నీ బనాయించి దర్యాప్తులు చేసే పోలీసులు అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి జగన్ పై దాడి జరిగితే మాత్రం ఏ కారణం చేత ఈ కేసును వేగవంతం చెయ్యకుండా నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ శ్రేణులు అనుమాన పడుతున్నారు.

అంతే కాకుండా జగన్ మీద దాడి జరిగిన అతి కొద్ది సమయంలోనే డీజీపీ ఠాకూర్ ఇదంతా జగన్ కేవలం పబ్లిక్ స్టంట్ కోసమే చేసాడని తేల్చి చెప్పెయ్యడం వైసీపీ లో మరింత అనుమానాలకు దారి తీసింది.ఈ విషయం మీదనే కేసును ఈ విధంగానే దర్యాప్తు చేస్తారా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.పోలీసు వారు టీడీపీతో కుమ్మక్కయ్యి జగన్ మీద హత్యా ప్రయత్న కేసును కావాలనే నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నారని,అసలు పోలీసులు ఈ కేసును ఎందుకు ఇంత తేలికగా తీసుకుంటున్నారని,చిన్న తప్పు చేస్తేనే ఎన్నో కేసులు పెట్టే ఈ పోలీసులు జగన్ మీద దాడి చేసినటువంటి శ్రీనివాసరావు మీద కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు చెయ్యడం ఏమిటని? వీరి వెనుక ఎవరో ఉండి కావాలనే వారితో కేసును తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా అసలు అత్యంత కీలకమైన ఆధారం అయినటువంటి విశాఖ ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ని ఎందుకని విచారించట్లేదు అని పలు రకాల అనుమానాలు వైసీపీ వ్యక్తపరుస్తున్నారు.దీని వెనుక చాలా పెద్ద కుట్రే జరుగుతుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments