జగన్ కు జరిగింది ప్రాణాంతక ప్రమాదమే..పోలీసు రిపోర్టులో నమ్మలేని నిజాలు.!

Sunday, October 28th, 2018, 05:34:52 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పై మొన్న జరిగిన హత్యా యత్నంపై ఇప్పటికి పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది,ఇదిలా ఉండగా తెలుగుదేశం మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు.జగన్ కు తగిలింది చిన్న గాయమే అని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మరియు దాడి చిన్నది అయినా తగిలిన గాయం మాత్రం చాలా పెద్దదే అని వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు,అయితే తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఈ రోజు బయట పెట్టినటువంటి రిపోర్టులో వచినటువంటి కొన్ని సాక్ష్యాలు ఇప్పడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసే విధంగా ఉన్నాయి.

పోలీసుల యొక్క రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నట్టుగా జగన్ కు తగిలింది చిన్న గాయం కాదని,దాదాపు మూడు ఇంచుల లోతుకు ఆ కత్తి దిగిందని తెలిపారు,అంతే కాకుండా అదే కత్తి వేటు గాని మెడ మీదనే గాని తగిలి ఉంటే జగన్ యొక్క ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు పొందుపరిచిన రిపోర్టులో తెలిపారు.శ్రీనివాసు రావు తో పాటు అతనికి సహకరించినటువంటి మరో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.కత్తి జగన్ యొక్క భుజానికి తగలడం అదృష్టమని, అదే మెడ మీద గాని తగిలితే పెద్ద ఘోరమే జరిగి ఉండేదని రిపోర్టులో తెలిపారు.ప్రభుత్వం ఈ చర్యను తక్కువ చెయ్యడానికి ప్రయత్నిస్తుందని,పోలీసు రేపోతూ ద్వారా అసలు నిజం ఏమిటో ప్రజలకు తెలిసిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments