షాకింగ్ : హైపర్ ఆది జబర్దస్త్ మానేసి “జనసేన”లో చేరుతున్నారా..!? షకలక శంకర్ కూడా!

Thursday, October 18th, 2018, 03:13:02 PM IST

బుల్లితెర మీద జబర్దస్త్ షో అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రీతో అందరికి తెలుసు.గురువారం శుక్రవారం వచ్చాయంటే చాలు రాత్రి 9:30కు ఈటీవీ ఛానల్ కు అతుక్కుపోతారు.మరి దీనికి కారణం అందులో ఉండే హాస్య నటులు.ఇప్పటికే చాలా మంది అలాగే వచ్చి ఇంకా అక్కడే షో కొనసాగిస్తూ సినిమాలు చేసుకుంటున్నారు.మరికొంత మంది షో ని మానుకొని సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు.కొన్నేళ్ల క్రితం వచ్చినటువంటి షకలక శంకర్ తనకు సినిమా ఆఫర్లు అధికంగా రావడంతో జబర్దస్త్ షో మానుకొని సినిమాలు చేస్తున్నారు.

ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ ను దాటగల సత్త ఉన్న పోటీదారుడు “హైపర్ ఆది” ప్రస్తుతానికి జబర్దస్త్ చేస్తున్నా సరే అంతర్గత సమాచారాల ప్రకారం జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.అయితే స్వతహాగా ఆది మరియు శంకర్ లు పవన్ యొక్క వీరాభిమానులని అందరికి తెలుసు.గత కొద్ది రోజుల క్రితం తిత్లి తుఫాను బాధితులకు అండగా శంకర్ పవన్ పేరిట తన వంతు సాయం చేశారు.అంతే కాకుండా గత కొంత కాలంగా హైపర్ ఆది కూడా జనసేన పార్టీ కార్యకలాపాల్లో ప్రచారానికి ముఖ్య అతిధిగా వస్తున్నారు.మొన్నటికి మొన్న భారీ కవాతుకు కూడా ఆది హాజరయ్యారు. ఆది అందుకోసమే జబర్దస్త్ షో కి బ్రేక్ ఇచ్చి జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు ఊహా గానాలు అధికంగా వస్తున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పవన్ నుంచి ఎలాంటి సందేశాలు వస్తాయో చూడాలి.