నందమూరి అభిమానులకు కోపం తెప్పించేలా..సుహాసిని నామినేషన్లో తప్పులు.!

Tuesday, November 20th, 2018, 09:18:07 PM IST


తెలంగాణ రాష్ట్రం కూకట్ పల్లి నియోజిక వర్గం నుంచి మహా కూటమి టీటీడీపీ తరపు నుంచి నందమూరి కుటుంబానికి చెందిన సుహాసిని ఎన్నికల బరిలో పోటీకి దిగుతూ నామినేషన్ వేసి హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.తనకి చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం అని చెప్పిన ఆవిడ ఇప్పుడు నందమూరి అభిమానులకు ఒక పక్క కోపం ఒక పక్క బాధ తెప్పించేంత పని చేశారు.

తాను కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నట్టుగా వేసినటువంటి నామినేషన్ లో నందమూరి కుటుంబీకులు మరియు అభిమానులు షాక్ కి గురయ్యే తప్పులు ఉన్నాయి అని తెలుస్తుంది.అది ఏమిటంటే తన నామినేషన్ లో తాను నందమూరి హరి కృష్ణ తనయురాలు అని ఉండాల్సిన చోటులో అది కొట్టివేసి హరి కృష్ణ యొక్క భార్య గా రాసి నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది.ఇది ఒక్కటే కాకుండా అచ్చు ఇలాగే మళ్ళీ ఓటర్ల జాబితాలో కూడా ఇలాగే ఉన్నట్టు తెలుస్తుంది.దీనితో నందమూరి అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.అసలు నామినేషన్ లోనే ఇన్ని తప్పులు ఉండటం ఏమిటి అని సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది.ఇది నిజంగా నందమూరి అభిమానులుకు ఒక రకంగా బాధ పెట్టే విషయమే అని చెప్పాలి.