షాకింగ్ – ప్రజల ఖాతాల్లో మోడీ డబ్బులు వేస్తున్నారా…?

Saturday, February 9th, 2019, 04:11:18 PM IST

ఈ మధ్య కాలంలో సామజిక మాంద్యమాల్లో ప్రతి వార్త వైరల్ అవుతుంది… అది నిజామా, కాదా అనేది పక్కనపెడితే సైట్లల్లో వచ్చిన ప్రతి వార్త కూడా ప్రజలు గుడిగా నమ్ముతున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మొత్తుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు అసలే వినిపించుకోవడం లేదు. అదే ఏదైనా ప్రముఖుల కోసం వచ్చినటువంటి వార్తలు కనిపించడమే తరువాయి… నిజానిజాలు తెలుసుకోకుండా కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. తరువాత వారు ఇబ్బందికి గురికావాల్సి వస్తుంది. అలంటి వార్తే ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

గతంలో దిగువ తరగతి ప్రజల ఖాతాల్లో ప్రధాని మోడీ గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో 25 వేల రూపాయల నుండి 15లక్షలకు పైగా డబ్బులు వేస్తారని ప్రకటించారు. ఆ తరువాత ఆ సంగతిని మర్చిపోయిన మోడీ గారికి, ఈ మధ్యనే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా గుర్తు చేసి మరీ విమర్శలు చేశారు… అయితే ఈ సందర్భంగా మోడీ గారు స్పందించి డబ్బులు వేస్తున్నారనే వార్త షికార్లు చేయడం మొదలెట్టింది. అంతే ఇక అక్కడి ప్రజలందరూ కూడా తిండి నిద్ర అన్ని మానేసి మరీ పోస్టాఫీసులో ఖాతాలు తెరవడానికి పోటీ పడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని అధికారులు చెప్పినప్పటికీ కూడా ప్రజలు వినకుండా, అక్కడ బారులు కనిపించారు… ఈ సంఘటన బీహార్ లోని మోతీహారి గ్రామంలో జరిగింది. ఖాతాల్లో డబ్బులు జామకావడం పక్కనపెడితే… బోలెడన్ని కొత్త ఖాతాలు తెరుచుకోవడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sh