షాకింగ్ న్యూస్ : చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ దెబ్బ !

Monday, April 9th, 2018, 08:30:01 PM IST


చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కేదార్ జాదవ్ ఓపెనర్ గా దిగాడు. అయితే కాసేపటి తరువాత అతను రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగి, మళ్ళి మ్యాచ్ చివరిలో వచ్చి సిక్స్ అలానే ఫోర్ కొట్టి జట్టుకు విజయం అందించాడు. అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అతడు ఈ సిరీస్ మొత్తం ఆటకు దూరమైనట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం అతని తొడ కండరాలు పట్టేయడమేనట.

డాక్టర్లు కూడా అతడికి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారని అందుకే అతడు తప్పుకుంటున్నట్లు టీం మేనేజిమెంట్ ప్రకటించింది. అయితే ఇది తమ జట్టుకు పెద్ద నష్టమేనని మైఖేల్ హస్సీ అన్నారు. కాగా మొన్న జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని చెన్నై జట్టు రూ. 7.8 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో రానున్న మ్యాచ్ లలో ఎవరిని తీసుకుంటారు అనేది మాత్రం తెలియరాలేదు……