షాకింగ్ న్యూస్ : మగాడిగా మారనున్న మహిళ!

Saturday, May 26th, 2018, 02:00:20 AM IST

మనం అక్కడక్కడా ఆడవారిగా మారిన హిజ్రాలను చూస్తుంటాము. చిన్న పిల్లల వయసు నుంచి శరీరంలో ఏర్పడే కొన్నిరకాల మార్పుల వల్ల కొందరు మగవారు అలా హిజ్రాలుగా మారుతుంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం దీనికి పూర్తి విరుద్ధమైనది. మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒక మహిళ, మగాడిగా మారాలని నిర్ణయించుకుంది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, మజల్ గావ్ పోలీస్ స్టేషన్ లో కొనిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 29 ఏళ్ళ లలిత, తన పనితనంతో పైఅధికారులనుండి మంచి పేరు సంపాదించింది. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె తన శరీరంలో ఎన్నడూ లేని కొన్ని మార్పులు వస్తున్నాయని గ్రహించి డాక్టరు వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంది. నిజానికి పురుషుల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. అదే మహిళల్లో అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్ లు ఉంటాయి. అనూహ్యంగా ఆమె శరీరంలో వై క్రోమోజోమ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దానితో ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఆమెను పురుషుడుగా మారేవిధంగా శస్త్ర చికిత్స చేయించుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు.

దీనితో తనకు చికిత్సకు అనుమతినివ్వాలని, అంతేకాక తనను ఇకపై లలిత్ గా గుర్తించాలని డిజిపి ని విన్నవించింది. కానీ ఆయననుండి సరైన సమాధానం రాకపోవడంతో, ముంబై కోర్ట్ కు వెళ్లగా, కోర్ట్ సూచనతో పరిపాలనా ట్రిబ్యునల్ లో ఒక పిటీషన్ దాఖలు చేసింది. తదనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి విషయం విన్నవించింది. అందుకు ఆయన హామీ ఇవ్వడంతో ఆమె ఫైల్ వేగంగా కదిలింది. ఇక ఆమె లింగమార్పిడి పూర్తిగా అనుమతి లభించినట్లేనని బీడ్ జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. కాగా ఆమెకు లింగమార్పిడి ఆపరేషన్ కోసం ముంబై లోని జేజే ఆసుపత్రి వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసారని, అతి త్వరలోనే ఆమెకు ఆపరేషన్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లలిత విషయం మహారాష్ట్ర మొత్తం తెలిసింది. కాగా ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…….

  •  
  •  
  •  
  •  

Comments