షాకింగ్ న్యూస్ : కుమారుడిని చంపిన సినీ రచయిత!

Friday, May 11th, 2018, 12:01:15 PM IST

కొన్నాళ్లుగా మనదేశంలో జరుగుతున్న హత్యోదంతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల మధురైలో జరిగిన ఒక హత్య కేసులో కన్నతండ్రే కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే, మదురై టోక్ నగర్లోని ఎస్బిఓ కాలనీకి చెందిన 55ఏళ్ళ సౌందర పాండియన్ అలియాస్ సౌపా ఒక సినీ కథా రచయిత. ఆయన భార్య లతా పూర్ణం కోవిల్పట్టి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తోంది.వీరికి ఒక్కడే కుమారుడు. అతని పేరు విపిన్ (27). అయితే 14 ఏళ్ళ క్రితం ఇద్దరిమధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో ఇద్దరూకలిసి కోర్ట్ లో విడాకులు తీసుకుని విడివిడి వుంటున్నారు.

కాగా కుమారుడు విపిన్ మాత్రం 15 రోజులు తండ్రి దగ్గర, మరొక 15 రోజులు తల్లి దగ్గర ఉంటున్నాడు. కాగా మొన్న ఏప్రిల్ 30న తల్లివద్దకు రావలసిన విపిన్ కనిపించకుండా పోవడంతో భయపడ్డ లత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదులో ఇటీవల ఒక ఖరీదైన కార్ అమ్మడంతో తండ్రికి, విపిన్ కి మధ్య చిన్న వివాదం జరిగినట్లు తెలిపింది. అయితే ఆ పాయింట్ ని ఆసరాగా చేసుకున్న పోలీస్ లు పాండియన్ కదలికలపై నిఘా పెట్టి అనుమానంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గట్టిగా అతన్ని విచారించడంతో జరిగిన విషయం చెప్పాడు పాండియన్. కుమారుడు విపిన్ మత్తు పదార్దాలకు అలవాటు పడ్డాడని, తరచు తనను డబ్బుల కోసం వేధించేవాడని చెప్పాడు.

కొద్దిరోజుల క్రితం విపిన్ కు ఒక ఖరీదైన కారును కొనిచ్చానని, తనకు చెప్పకుండా వ్యసనాలకోసం ఆ కారును అమ్మేసాడని తెలిపాడు. ఎందుకు అమ్మావు అని గట్టిగా నిలదీయడంతో బూతులు తిడుతూ తనపై ఎదురు దాడి చేసాడని, వెంటనే కోపంలో అక్కడవున్న సుత్తితో అతని తలపై మోదగా, విపిన్ అక్కడికక్కడే మరణించినట్లు తెలిపాడు. తరువాత విపిన్ మృతదేహాన్ని దిండుకల్‌ సమీపంలోని తన తోట బంగ్లా ప్రాంగణానికి తీసుకెళ్లి అక్కడ పనిచేసే భూమి, గణేశన్‌ సాయంతో పూడ్చిపెట్టినట్టు పాండియన్ తెలిపాడు. ఈ విషయం విన్న లతా పూర్ణం కన్నీరు మున్నీరు అయింది. పోలీస్ లు పాండియన్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు…….