పాదయాత్రలో పాకెట్ మనీ రూ.35 కోట్లు..జగన్ డబ్బు మాత్రం కాదు..?

Tuesday, November 7th, 2017, 02:56:28 PM IST

ప్రతి పక్ష నేత జగన్ వైసిపి కేడర్ కు ఉత్సాహాన్నిచ్చేలా నిన్న లాంఛనంగా ఇడుపుల పాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఆరు నెలల పాటు జగన్ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించడంతో టీడీపీ వైపు నుంచి విమర్శల దాడి కూడా పెరిగింది. పాదయాత్ర ప్రారంభించే సమయంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అంత మోసకారి దేశంలోనే లేరు అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీకి కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ కొత్త ఆరోపణలని తెరపైకి తీసుకుని వచ్చింది.

ఇప్పటి పరిస్థితుల్లో ఆరు నెలల పాటు పాదయాత్ర నిర్వహించడం అంత సులువైన విషయం కాదని అంటున్నారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న అంశం అనేది టిడిపి వాదన. దీని వెనుక ఓ బడా నేత ఉండి జగన్ పాదయత్రని జరిపిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది. ఓ కొత్త వక్తిని టీడీపీ తెరపైకి తీసుకుని వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ పాదయాత్రకు భారీగా ఖర్చు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్య సభ సీటు కోసం గత కొంత కాలంగా వైసిపితో ఆయన టచ్ లో ఉంటున్నారని అంటున్నారు. దాదాపు రూ 35 కోట్లని ప్రభాకర్ రెడ్డి జగన్ కోసం ఖర్చు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దేశ విదేశాల్లో వేమిరెడ్డి భారీ కాంట్రాక్టర్. రాజ్య సభ సీటుపై కన్నేసిన ఆయన జగన్ పాదయాత్ర ఖర్చులు భరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments