కర్ణాటక ఎలక్షన్ లో ఊహించని ట్విస్ట్.. వీడియోస్ లీక్!

Friday, May 11th, 2018, 07:38:46 AM IST


గత కొన్ని రోజులుగా బీజేపీ కర్ణాటకలో ఎలాగైనా గెలవాలని పోటీ పడుతూ ప్రచారాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కరెక్ట్ గా ఎన్నికల సమయానికి కొన్ని గంటల గడువకు ముందే పార్టీకి గట్టి దెబ్బ తగలడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఊహించని విధంగా గాలి జనార్దన్ రెడ్డి కేసు వివాదం ఒక వీడియో ద్వారా బయటకు రావడం సంచలనంగా మారింది. మైనింగ్ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావడానికి గాలి సుప్రీం కోర్టు అధిష్టానంలో న్యాయ మూర్తి అల్లుడితో బేరాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జులై 1న 2010లో దాదాపు 500 కోట్లకు డీల్ మాట్లాడుకున్నట్లు ఆ వీడియో ద్వారా తేలింది.

ఆ వీడియోలో న్యాయమూర్తి అల్లుడు శ్రీనిజన్‌తోపాటు గనుల డీలర్లు పూబాలన్, కెప్టెన్ రెడ్డి‌తోపాటు ఓ స్వామీజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినా విషయం పెద్దగా వైరల్ అవ్వలేదు. ఇక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాక పార్టీ మద్దతుదారుడు గాలి జనార్ధన్ ఆ విధంగా చేయడం ఇప్పుడు బీజేపీనంబి కలవరపడుతోంది. ఎంత ఖండించినప్పటికీ కాంగ్రెస్ వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆ తరహా వార్తలను ప్రదర్శించవద్దని చెప్పినా కూడా కాంగ్రెస్ పెద్దలు ప్రేస్ మీట్ లో అందుకు సంబందించిన వీడియోల గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్య నాయకుడు అమిత్ షా ఈ ఘటనను ఖండించారు. ఘటనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ.. కావాలనే కాంగ్రెస్ ఈ విధంగా చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.