కథువా ఘటన :నిజమైతే అతన్ని పెళ్లి చేసుకోను

Sunday, April 15th, 2018, 12:45:58 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా బాలిక అత్యాచార ఘటన రోజుకో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం భారత ప్రభుత్వంపై నిరసనలు పెరుగుతున్నాయి. ఘటనకు పాల్పడిన నిందితులను ఏ మాత్రం వదలకూడదని ఉరి శిక్షే వారికి సరైన శిక్ష అని అందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఘటనలో ఉన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో నలుగురు పోలీసులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం అందులో ఒక పోలీస్ న్యూస్ వైరల్ గా మారింది, ధీపక్‌ కజూరియా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అయితే ఆ వ్యక్తికి రేణు శర్మ అనే యువతీతో గత ఏడాది డిసెంబర్ లో నిశ్చితార్ధం అయ్యింది. ఘటనతో అతనికి సంబంధం ఉంది అని తెలియగానే కుటుంబ సభ్యులు కూడా ఉమ్మేశారు. దీపక్ తల్లిదండ్రులు కూడా అతన్నీ చూడటానికి ఇంతవరకు జైలుకి వెళ్లలేదు. కానీ అతన్ని నిశ్చితార్థంలోనే ఇష్టపడిన యువతి నేహా అతను నిజంగానే తప్పు చేశాడో లేదో అనే విషయాన్ని తాను తెల్సుకుంటా అని చెప్పింది.

అప్పటి వరకు అతనికోసమే ఎదురుచూస్తా అని వివరించింది. ఒక వేల అతను తప్పు చేశాడని రుజువైతే ఏ మాత్రం ఆలోచించకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని ఆ యువతి గట్టిగా చెప్పింది. అయితే తనకు తెలిసినంత వరకు దీపక్ చాలా మంచివాడని ఎప్పుడు ఎలాంటి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడలేదని చెబుతూ.. జైల్లో అతన్ని కలిసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరింది. అతని కళ్లల్లోకి చూసి నిజం ఏంటో తెలుసుకుంటానని రేణు శర్మ చెప్పడం మీడియాల్లో వైరల్ గా మారింది.