శ్రీ రెడ్డికి షాక్.. ఆమె తప్పు చేసిందని పోలీస్ కంప్లైంట్!

Monday, July 23rd, 2018, 10:02:31 PM IST


టాలీవుడ్ లో గత కొంత కాలంగా శ్రీ రెడ్డికి సంబందించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి తెలుగు పాలిటిక్స్ వరకు చాలా మందిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి రీసెంట్ గా కోలీవుడ్ సినీ ప్రముఖులపై కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. తనను శారీరకంగా ఉపయోగించుకున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు కౌంటర్ ఇచ్చారు.

ఇకపోతే తమిళనాడుకి చెందిన ఇండియన్ మక్కల్ మంద్రం(ఐఎంఎం) అనే సంస్థలోని సభ్యుడు సిటీ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేశాడు. ఆమె ప్రవర్తన భారతీయ సాంస్కృతికి సమాజానికి విరుద్ధంగా ఉన్నాయని కంప్లైంట్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. సినిమా అవకాశాల కోసం నటుల దగ్గర దర్శకుల దగ్గర పడుకున్నట్లు చెబుతోంది. అది వ్యభిచారం కిందకే వస్తుందని ఆమె మాటల్లోనే తప్పు చేసినట్లు తెలుస్తోంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులకు పిర్యాదు అందింది. మరి ఈ కేసుపై వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments