SSC షాకింగ్ న్యూస్: 21 ప్రభుత్వ పాఠశాలలలో 0% ఉత్తీర్ణత

Friday, April 27th, 2018, 09:24:02 PM IST


తెలంగాణ రాష్ట్రంలో 2017-18 ఏడాది విద్యార్థుల 10 తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఎప్పటిలానే బాలికలు మొదటి స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,34,726 విద్యార్థులు పరిక్షలు రాశారు. ఉత్తీర్ణత శాతం 83.78 గా నమోదయ్యింది.
మొత్తం 2125 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. బాలికల ఉత్తీర్ణత శాతం 85.14 నమోదవ్వగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 82.46 శాతం దగ్గర ఆగింది.

ఇక జిల్లాల వారీగా టెన్త్ ఫలితాల్లో జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. చివరగా అతి తక్కువ రిజల్ట్ ఆదిలాబాద్ జిల్లాలో వచ్చింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లల్లో ఫలితాలు మెరుగుపడగా.. 21 ప్రభుత్వ పాఠశాలల్లో సున్న శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక జూన్ 4 నుంచి 19వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు ఆఖరు తేదీ మే 21.

  •  
  •  
  •  
  •  

Comments