షాకింగ్ న్యూస్ : రేవంత్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం!

Wednesday, October 10th, 2018, 01:14:53 PM IST

తెలంగాణలోని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాలో బలమైన నాయకుల్లో ఖచ్చితంగా కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉంటారు.ప్రజల్లో అతనికున్న ఆదరణ అలాంటిది,మొన్న ఆ మధ్య రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఉండగా అతని ఇంటి మీద జరిగినటువంటి ఐటీ దాడులు ఎంతటి కలకలాన్ని రేపాయో అందరికి తెలుసు.దానితో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను కనబర్చారు.ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ మళ్ళీ బాంబు పేల్చారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడంతో తీవ్ర సంచలనం కావడంతో ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమీషన్ వారికి పిర్యాదు చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది.ఇంతకముందు ఒకసారి ఇంటిలెజెన్స్ బ్యూరో వారు రేవంత్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇచ్చిన నివేదిక నిమిత్తం రేవంత్ రెడ్డి తాజాగా పిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ తనకు కేంద్రమే రక్షణ కల్పించాలి అని రేవంత్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది.కేంద్ర ఎన్నికల సంఘం వారు ఆ పిర్యాదుని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము అని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.