షాకింగ్ న్యూస్ : ఆమె తిన్న ఐస్ క్రీంలో ఏమి వచ్చిందో తెలిస్తే ఎప్పటికీ ఐస్ క్రీం ముట్టరు!

Sunday, April 29th, 2018, 08:30:42 PM IST

ఐస్ క్రీం ను దాదాపుగా ఇష్టపడని వారు ఎవరూ వుండరు. చిన్నపిల్లలు, పెద్దలు సహా అందరూ ఎంతో ఇష్టంగా తినే పదార్థంగా అది. అసలే ప్రస్తుతం నడుస్తోంది ఎండాకాలం కాబట్టి పిల్లలు మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే చైనాలో ఇటీవల ఐస్ క్రీం విషయం లో జరిగిన ఒక సంఘటన వింటే ఇంకా జీవితంలో ఐస్ క్రీం ముట్టరు. విషయం లోకి వెళితే, చైనాలోని యాంగ్ అనే ఒక మహిళ ఒక సూపర్ మార్కెట్ లో ఐస్ క్రీం కొనుక్కుని తింటున్న సమయంలో మధ్యలో ఏదో వేరే రుచి తగులుతున్నట్లు గమనించి చూసింది, మొదట అదేదో చిన్న పురుగు అనుకున్న ఆమె, వెంటనే తన స్నేహితురాలిని పిలిచి ఇదేమిటో చూడమని చెప్పింది.

చాలా వరకు ఐస్ క్రీం మధ్యలో పరికించి చూస్తే అది ఒక ఎలుక తోక. అది చూసిన ఆ ఇద్దరు అమ్మాయిలు షాక్ గు గురై వెంటనే సూపర్ మార్కెట్ ఓనర్ దగ్గరకు వెళ్లి దానిని చూపి జరిగిన దానికి పరిహారం కోరగా, ఆ ఓనర్ యాంగ్ కు కొన్ని డజన్ల ఐస్ క్రీం లు ఇస్తానని చెప్పాడు. దానికి యాంగ్ ఒప్పుకోలేదు. తరువాత ఒక 800 యువన్ లు ఇస్తానని బ్రతిమిలాడాడు. ఆమె వినకపోవడంతో చివరికి 2000 యువనాలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తనతో ఒక ఎలుక ఫ్లేవర్ ఐస్ క్రీం తినిపించినందుకు పరిహారంగా యాంగ్ 50,000 యువనాలు ఇవ్వమని కోరింది.

అయితే అతడు దానికి అంగీకరించకపోవడంతో, లోకల్ అథారిటీ సహాయంతో కోర్ట్ లో అతనిపై కేసు నమోదు చేసిన ఆమెకు న్యాయం చేసేలా కోర్ట్ తీర్పు ఇచ్చింది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే జరిగిన తప్పుకు యాంగ్ కు కోర్ట్ నష్టపరిహారం ఇప్పించింది కేవలం 1000 యువాన్ లే కావడం గమనార్హం ……

  •  
  •  
  •  
  •  

Comments