వినయ విధేయ రామ: పబ్లిక్ టాక్ వింటే షాకే..!

Friday, January 11th, 2019, 03:30:59 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వినయ విధేయ రామ ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అతి దారుణమైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది, కథలో కొత్తదనం ఏమి లేదని, బలవంతంగా ఇరికించిన కామెడీ విసిగిస్తుందని, ఒక్క పాట మినహా దేవి అందించిన సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా థియేటర్ల వద్ద పబ్లిక్ రెస్పాన్స్ మరీ దారుణంగా ఉంది, దర్శకుడు బోయపాటిపై ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు, ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫైట్ సీన్ లో విలన్ల తలలను గద్దలు ఎత్తుకెల్లే సీన్ ను, విలన్ ను కాటేసిన పాము చనిపోయే సీన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కు ఇంత దారుణమైన డిజాస్టర్ రావటం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. అప్పట్లో బ్రహ్మోత్సవం తర్వాత , ఇటీవల ఏ సినిమాకు కూడా పబ్లిక్ నుండి ఇంత దారుణమైన టాక్ రాలేదు