తెలంగాణాలో “కారు”ని వారే పేల్చేసేలా ఉన్నారు..35 కూడా కష్టమే అంట.!

Tuesday, November 6th, 2018, 03:49:39 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా చాలా కొద్దిగా సమయం మాత్రమే మిగిలి ఉంది,ఏ పార్టీకి చెందిన నేతలు వారి పార్టీ యొక్క ఎన్నికల ప్రచారాల్లో బిజీ గా ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో మేమె గెలవబోతున్నామని ఏ పార్టీకి చెందిన నేతలు వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట.ఇక తెరాస మాటకి వస్తే వారు ముందుగానే 105 మంది అభ్యర్థుల యొక్క లిస్ట్ ను విడుదల చేసి 100 కి పైగా సీట్లను కొల్లగొడతామని,ఎన్ని కూటములు వచ్చినా సరే కారు జోరును ఆపలేవని నిక్కచ్చిగా చెప్తున్నారు.వీరు బయటకి అలా చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు వీరు అనుకుంటున్నటుగానే అక్కడి రాష్ట్రంలోని క్షేత్ర స్థాయి ప్రజలు కూడా భావించాలి కదాని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బయటకి తెరాస నాయకులూ అంత బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నా సరే క్షేత్ర స్థాయిలోకి వెళ్లే సరికి కారుకి అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి,కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ఇప్పుడు వారి మీద తిరగబడుతున్నారు,ఇప్పటికే చాలా చోట్ల వీరికి చాలా చేదు సంఘటనలు కూడా ఎదురయ్యాయి.దీనితో 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న తెరాస ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 గెలవడం కూడా కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే అటు మహా కూటమి యొక్క పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే అది కూడా లేదు,వారిలో వారికే ఇంకా ఒక క్లారిటీ రాలేదు దీనితో వారు ప్రభుత్వాన్ని స్థాపిస్తారా అన్నది కూడా సందేహమే అని అభిప్రాయపడుతున్నారు,అయితే ఈ మధ్య కెసిఆర్ ఢిల్లీ పర్యటనలు బాగా చేస్తున్న సంగతి తెలిసినదే అయితే ఆ మధ్యలోనే అమిత్ షా తో భేటీలు జరుగుతున్నాయని తెరాస మరియు బీజేపీ లు కలిసిపోతాయేమో అని అంతర్గతంగా వారు చర్చలు కూడా చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.