రజిని రాజకీయ భవిష్యత్ పై తమిళనాట షాకింగ్ సర్వే రిపోర్ట్ !

Sunday, May 13th, 2018, 06:55:41 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ గత డిసెంబర్ 31న తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఆయన అభిమానులు పార్టీ పేరు, గుర్తు ప్రకటన పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు లోక నాయకుడు కమల్ పార్టీ ని ప్రకటించి ప్రస్తుతం ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే రజిని ఇప్పటికే తన పార్టీకి సంబంధించి కార్యాచరణ, పార్టీ పేరు, విధివిధానాల రూపకల్పన కొందరు ప్రముఖులతో ఎంతో పకడ్బందీగా చేయిస్తున్నారని, అతిత్వరలోనే ఆయన పార్టీ ప్రకటన ఉంటుంది ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

కాగా మరో వైపు రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అక్కడి ప్రముఖ పార్టీలన్నీ తమ తమ వ్యూహ రచనతో ప్రజలవద్దకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ‘దినమలర్’ అనే పత్రిక తమిళనాడులో రానున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు , ప్రజల తీర్పు ఎటువైపు వుంది అనే అంశాలపై నిశితంగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వారికి షాకింగ్ నిజాలు తెలిసాయి. తమిళ ప్రజలు తలైవా రాకకోసం ఎంతో ఉద్విజ్ఞంతో ఎదురుచూస్తున్నారని, ఆయన ఖచ్చితంగా ప్రస్తుతం వున్న రాజకీయ ముఖచిత్రాన్ని ప్రజలకు పూర్తిగా మేలు చేసేలా మారుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నట్లు తేలిందట. కాగా జరిగిన ఈ సర్వేలో మొత్తం తమిళనాడులో వున్న 234 నియోజకవర్గాలకు గాను దాదాపు 150కి పైగా స్థానాలను రజిని పార్టీ గెలుస్తుందని, ఆ దెబ్బతో ప్రస్తుత అధికారపార్టీ అన్నాడీఎంకే కి పెద్ద దెబ్బె తగులుతుందని తేలిందట.

అయితే అమ్మ జయలలిత మరణంతో రాష్ట్రాన్ని సరైన దిశా నిర్దేశకత్వంతో ముందుకు తీసుకెళ్లే నాయకుడు కరువయ్యాడని, ప్రజలు రజిని నేతృత్వంలో ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అయితే దినమలర్ సర్వే నివేదికతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కొంత ఆలోచనలో పడ్డాయని, మరో వైపు కమల్ పార్టీకూడా మరింత బలంగా ప్రజలకు చేరువయ్యేలా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అసలు రజిని ఇంతవరకు తన పార్టీ పేరు గాని, గుర్తు గాని, విధివిధానాలు గాని ప్రకటించలేదు. అయినప్పటికి ఇప్పటినుండే అయన పార్టీపై ప్రజల్లో ఇంత నమ్మకం ఉందంటే, రేపు పార్టీ ప్రకటన తర్వాత ఆయన రాజకీయాల్లో ఆయన పెద్ద ప్రభంజనేం సృష్టించేలా వున్నారని అక్కడి పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు……..

Comments