బాబోయ్ ..విజయ్ మాల్యా బయోపిక్ ?

Thursday, May 31st, 2018, 02:45:21 AM IST


ఈ మధ్య బాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. ఎంతగా ఎక్కువైంది అంటే అవతలి వ్యక్తి ఎవరు .. సమాజానికి ఎంత మంచి చేశారన్న విషయం కంటే అతను ఎంతలా పాపులర్ అయ్యాడన్న విషయాన్నీ పరిగణలోకి తీసుకుని బయోపిక్ సినిమాలు తెరెకెక్కించే దిక్కుమాలిన పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ ఇదంతా ఏమిటి ? ఎవరి బయోపిక్ అని షాక్ అవుతున్నారా ? ఎవరితో కాదు ఏకంగా 1200 వెల కోట్లను ముంచేసి పారిపోయిన రసిక రాజు .. కింగ్ ఫిషర్ ఓనర్ విజయ మాల్యా జీవిత కథ !! అవును అయన పేరుతొ సినిమా చేస్తున్నది ఎవరో కాదు నాటి స్టార్ గోవిందా టైటిల్ రోల్ లో పోషిస్తున్నారు. అయన జీవిత చరిత్రను తెరకెక్కించేది ఎవరో కాదు సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుందంట. మరి అయన జీవితం స్పూర్తితో ఇంకెంతమంది విజయ్ మల్యాల రెడీ అవుతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments