షాకింగ్ : జగన్ మీద దాడి చేస్తా చూడు..అమ్మాయితో శ్రీనివాస్ మాటల రికార్డింగ్.!

Wednesday, October 31st, 2018, 02:55:52 PM IST

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి సృష్టించిన ప్రకంపనలు అన్ని ఇన్ని కాదు.జగన్ పై హత్యకు పాల్పడినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు ఎవరు,ఏ పార్టీకి చెందిన వాడు,ఎవరు చెప్తే ఈ ఉదంతానికి పాల్పడ్డాడు అన్న విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు,అయితే శ్రీనివాసరావు ని విచారిస్తున్నప్పుడు మాత్రం ఈ కథ రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది,నిన్ననే శ్రీనివాసరావు తాను ప్రజలతో మాట్లాడాలి అని తనకి ప్రాణహాని ఉందంటూ బాంబు పేల్చాడు.అయితే సిట్ అధికారులు శ్రీనివాసరావు యొక్క కాల్ డేటా ను పరిశీలించగా అందులోనుంచి మరిన్ని కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు.

శ్రీనివాసరావు యొక్క కాల్ డేటా ను పరిశీలించగా జగన్ పై దాడి చేసే ముందు రోజు సైరాబీ అనే యువతితో మాట్లాడిన రికార్డులను పరిశీలించి ఆరా తియ్యగా ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీస్కొని విచారణ చేపట్టగా ఆమె కొన్ని సంచలన నిజాలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది.జగన్ పై దాడి చేసే ముందు రోజు శ్రీనివాస్ తనకి మిస్సిడ్ కాల్ ద్వారా పరిచయం అయ్యాడని,తాను ఎవరు నిన్ను ఎలా చూడాలి అని అడగగా రేపు నేను జగన్ ని హత్య చెయ్యబోతున్నానని,అప్పుడు నన్ను మీరు అంతా టీవీల్లో నన్ను చూడొచ్చని శ్రీనివాసరావు తెలిపాడని ఆ యువతి తెలిపింది.అయితే ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క కుటుంబీకులు సైరాబీ యొక్క కాల్స్ కి తమకి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్నారు.అయితే ఈ దాడి పట్ల ఇప్పుడు ఆ యువతీ యొక్క కుటుంబీకులు అందరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని వారి మీద విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments