షాకింగ్ ట్విస్ట్ : జగన్ పై దాడి చేసిన వ్యక్తిని టీడీపీ కాపాడాలని చూస్తుందా..?

Friday, December 7th, 2018, 01:00:59 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద హత్యా యత్న ఘటన అక్కడ ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికి తెలుసు.అయితే ఈ చర్య కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే చెయ్యించిందని వైసీపీ శ్రేణులు ఇప్పటికే పలు సమాధానం లేని ప్రశ్నలను టీడీపీ క్యాడర్ కు సంధించారు.అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ చేరిందని తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష హోదా లో ఉన్నటువంటి వ్యక్తి మీద హత్యా యత్నానికి పాల్పడినటువంటి వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కాపాడాలని ప్రత్నిస్తుంది అని వైసీపీ శ్రేణులు మరియు వైసీపీ తరపు న్యాయవాది అంటున్నారు.

ఎందుకంటే ఒక పక్క ఈ కేసు మీద కేంద్రంతో దర్యాప్తు చెయ్యించకుండా ఇక్కడి పోలీసు యంత్రాంగం చేతుల్లోనే నొక్కి ఉంచేసిన పోలీసులే ఇప్పుడు టీడీపీ తో కలిసి హై కోర్టు ఇచ్చిన తీర్పునే తుంగలోకి తొక్కేయాలని చూస్తున్నారా అని హై కోర్టు, అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది.నిజానికి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు మీద సెక్షన్ 3A కింద కేసు నమోదు ఎందుకు నమోదు చెయ్యలేదు అని ప్రశ్నించగా,అడ్వొకేట్ జనరల్ మాత్రం అది అతనికి చాలా పెద్ద శిక్ష అవుతుందని,అందుకే అలా కేసు నమోదు చెయ్యలేదు అని చెప్పారు.

దీనితో కోర్టువారు ముద్దాయికి ఏ శిక్ష పడితే మీకేంటి,అతని మీద పెట్టాల్సిన సెక్షన్ నమోదు చెయ్యకుండా తక్కువ శిక్ష పడే సెక్షన్ పెట్టి అతనికి పడే శిక్షను మీరు తగ్గించాలని చూస్తున్నారా అని సూటి ప్రశ్న వేశారు.దీనితో ఇంకా అనుమానాలు లేవనెత్తాయని జగన్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.తెలుగుదేశం ప్రభుత్వమే కావాలని దాడికి పాల్పడిన యువకుడి మీద వారి న్యాయవాదులతో తక్కువ శిక్ష పడేలా చేసి త్వరగా కాపాడాలని చూస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు.