మోడీకి బయపడటమా… శివాజీ

Monday, February 11th, 2019, 08:30:23 PM IST

మన దేశ ప్రధాని మోడీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎం తెలియవని నటుడు శివాజీ, మోడీ పై విమర్శలు చేశారు… తన తల్లిని సైతం లైన్లో నిలబెట్టిన సంస్కృతి మోడీది అని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు సమయంలో ఎదో ఆలా సానుభూతి చూపించుకోడానికే ఆలా తన తల్లిని లైన్లో ఉంచాడని, అంతకుమించి ఎం లేదని ఆయన అన్నారు. మనమందరం కలిసి మోడీని వెళ్లగొడితే తాను మల్లి గుజరాత్ లో టీ కొట్ట్టు పెట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. ఏపీకి కియా మోటార్స్‌ ఇచ్చామని చెప్పడం దారుణమని, చంద్రబాబు సారథ్యంలోనే ఏపీకి కచ్చితంగా హోదా వస్తుందని శివాజీ తెలిపారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ అధికారం సాధించడం ఖాయమని, అంతేకాకుండా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని శివాజీ స్పష్టం చేశారు. ఇక్కడ మోడీకి భయపడేవారు ఎవరు లేరని ఆయన అన్నారు.