ఎయిడ్స్ ప్రచార కర్తగా శృతి హాసన్

Friday, December 19th, 2014, 04:12:22 PM IST

sruthu-Hasan
ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించే విషయంపై ప్రచారం చేసేందుకు ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది. దక్షిణాది భాషలలోనే కాకుండా బాలీవుడ్ లోను బిజీగా ఉన్న శృతిహాసన్ ఈ ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నదని ఎయిడ్స్ ప్రచార నిర్వాహకులు అంటున్నారు. ప్రస్తుతం దక్షిణాదిన… ఉత్తరాదిన సైతం బిజీగా ఉన్న ఈ హీరోయిన్… ఎయిడ్స్ పై ప్రచారం చేసేందుకు ఒప్పుకోవడం మంచిపరిణామమని…. ఎయిడ్స్ పై ప్రజలలో మరింత అవగాహన కల్పించవచ్చుఅని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక తెలుగు, తమిళ మరియు ఆంగ్ల బాషలలో ఎయిడ్స్ పై వీడియోను రూపొందిస్తామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ తమిళంలో విజయ్ సరసన, తెలుగులో మహేష్ బాబు సరసన నటిస్తున్న ఈ భామ హిందీలో ఐదు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.