యువరాజ్ వల్లే వరల్డ్ కప్ లో బాగా ఆడాను: అండర్-19 ప్లేయర్

Tuesday, February 6th, 2018, 11:50:13 PM IST

భారత అండర్ 19 క్రికెట్ జట్టు 2018 వరల్డ్ కప్ ని గెలిచి అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం వారికి క్రికెట్ దిగ్గజాల నుండే కాకుండా దేశ ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఎక్కువగా టోర్నీ లో శుభ్‌మన్‌ గిల్‌ అందరిని ఆకర్షించాడు. జట్టు కష్టకాలంలో ఉన్న ప్రతి సారి నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్లు వరుసగా అవుట్ అవుతున్నా పాక్ బౌలర్లను గిల్ సమర్ధవంతగా ఎదుర్కొని చివరి వరకు నిలిచాడు. ఆ మ్యాచ్ లో అతను చేసిన 102 పరుగులు చాలా ఉపయోగ పడ్డాయి.

అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్లే ముందు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో మేమందరం కోచింగ్ తీసుకున్నాం. అయితే ఆ సమయంలో యువరాజ్ సింగ్ అక్కడకు వచ్చాడు. మాతో క్రికెట్ ఆడటమే కాకుండా ముఖ్యమైన సలహాలను ఇచ్చాడు. స్టేడియం లో ఉండే పరిస్థితులను గురించి క్లియర్ గా చెప్పాడు. నాకు బ్యాటింగ్ లో కొన్ని సలహాలు ఇవ్వడం వలన చాలా వరకు ఉపయోగపడ్డాయి. నేను ఆ మ్యాచ్ లలో అంత నిలకడగా ఆడాను అంటే ఆ క్రెడిట్ అంతా యువరాజ్ కె చెందుతుందని శుభ్‌మన్‌ గిల్‌ వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments