మొదటి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు ఔట్ !

Tuesday, February 12th, 2019, 02:27:23 PM IST

కర్ణాటక రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను ఏదో విధంగా ప్రలోభపరిచి కుమారస్వామి సర్కారును కూల్చాలని బీజేపీ తెర వెనుక రకరకాల యత్నాలు చేస్తోంది. వాటిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సాహసానికి దిగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని రెపుతోంది.

బడ్జెట్ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరి హాజరుకావాలని కాంగ్రెస్ ముందుగా జారీ చేసిన విప్ ను కొందరు ఉల్లంఘించారు. మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. అయినా లెక్కచేయని నలుగురు ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మాకొట్టారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలపై విప్ ను ఉల్లగించినందుకు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు చర్యలు తీసుకోవాలని సిద్దా రామయ్య స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో కాదు మొదటి నుండి ప్లేటు పిరాయిస్తారనే అనుమానం ఉన్న రమేశ్ జార్కిహొళి, ఉమేశ్ జాదవ్, మహేశ్ కుమట్టహళి, నాగేంద్రలు. వీరిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇవ్వడం జరిగింది.