సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా!

Tuesday, May 15th, 2018, 05:02:48 PM IST

ప్రస్తుతం కర్ణాటకలో బిజెపి అత్యధిక సీట్లతో గెలుపొందే దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం అందుకోలేకపోయింది. నిజానికి బిజెపి గెలుస్తుందని ఎన్ని సర్వే లు చెప్పినప్పటికీ కూడా, కర్ణాటకలో హంగ్ వస్తుందని కూడా కొంత మేర ముందస్తు సర్వే ఫలితాలు చెప్పాయి. నిజానికి బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ప్రజలు గత ప్రభుత్వమైన కాంగ్రెస్ కు ఎక్కువ శాతం ఓట్లు వేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ పార్టీ నేతలు ఇప్పటికే జేడీఎస్ పార్టీ నేతలతో ప్రభుత్వ ఏర్పాటు విషయమై సమాలోచనలు జరుపుతున్నారని అన్నారు. అయితే అనుకున్నట్లుగానే కొద్దిసేపటిక్రితం జేడీఎస్ కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

బీజేపీ మాత్రం అక్కడ అధికారంలోకి రాకూడదన్న తలంపుతో ఫలితాలపై ఎప్పటికపుడు క్యాడర్ ని అప్రమత్తం చేసిన సోనియా గాంధీ, ఫలితాలు చివరిదశకు చేరుకునే సమయానికి ఈ కీలకనిర్ణయం ప్రకటించారు. అయితే ఈ విషయమై ఇప్పటికే గవర్నర్ నివాసానికి వెళ్లిన ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ పార్టీ, జేడీఎస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని, అంతేకాక తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను గవెర్నర్ కు అందచేశారు. అయితే గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా మరి కొద్దిసేపట్లో ఇరు పార్టీల నేతలు కూడా గవర్నర్ ను కలిసి ప్రబుత్వఏర్పాటుపై అధికారికంగా అనుమతి తీసుకోనున్నారు……