టెన్షన్ లేకుండా అసెంబ్లీలో సిద్దరామయ్య కునుకు!

Saturday, May 19th, 2018, 02:53:25 PM IST

దేశమంతా ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ వైపే చూస్తోంది. ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కి అందరూ షాక్ అయ్యారు. దాదాపు కాంగ్రెస్ అధికారాన్ని మిస్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో విరోధి అయిన బీజేపీకి అధికారం దక్కనివ్వకూడదని కాంగ్రెస్ తన మద్దతును జేడీఎస్ కు ఇచ్చింది. ప్రస్తుతం అందరూ బలపరీక్షలో ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడ లాగేసుకుంటారో అని ఆ పార్టీ అధిష్టానం నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అసెంబ్లీకి తీసుకువచ్చింది.

అయితే అసెంబ్లీ సమావేశంలో అందరు ఏం జరుగుతుందా అని సీరియస్ గా కంటి రెప్ప ఆర్పకుండా చూస్తుండగా మాజీ సీఎం సిద్దరామయ్య మాత్రం ఓ కునుకేసుకున్నారు. సభను పట్టించుకోకుండా తన నిద్రను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దరామయ్య కు ఇదేమీ కొత్త కాదు. గతంలో చాలా సార్లు ఇలానే నిద్రపోతూ నవ్వులపాలయ్యారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దేశమంతా కనిపించేలా సభను అన్ని న్యూస్ ఛానెల్స్ వారు కవర్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments