“కోహ్లీ… నీకు నువ్వే ఆలోచించుకో” – హీరో సిద్దార్థ్..!

Friday, November 9th, 2018, 02:22:05 PM IST

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ పై నెటిజెన్లు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. తాజాగా హీరో సిద్దార్థ్ ఈ అంశం పై తనదైన స్టైల్ లో విమర్శిస్తూ ట్వీట్ చేసాడు. ” కింగ్ కోహ్లీలా నువ్వు నిలవాలనుకుంటే, భవిష్యత్తులో ఏదైనా మాటాడే ముందు ద్రావిడ్ అయితే ఎం మాటాడతాడు అని నీకు నువ్వే ఆలోచించు. ఒక ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ నుండి ఎలాంటి చెత్త మాటలు వచ్చాయి.” అంటూ ట్వీట్ చేసాడు.

ఎపుడూ నెటిజన్లు ప్రసంశించే కోహ్లీని తాజాగా తాను చేసిన వ్యాఖ్యలకు గాను అతని పై మండిపడుతున్నారు, వివరాల్లోకి వెళితే నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజును పురస్కరించుకొని అతని పేరుతో ఒక యాప్ ను లాంచ్ చేసాడు. ఆ సందర్భం లో ” కోహ్లీ ఓవర్ రేటెడ్ బాట్స్ మెన్, అతని ఆటలో ప్రత్యేకత ఏమి ఉండదు, ఇండియన్ ప్లేయర్ల ఆట కంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్ల ఆటను బాగా ఇష్టపడతా” అంటూ ఒక నెటిజెన్ ట్వీట్ చేసాడు. కోహ్లీ దానికి స్పందిస్తూ అతనికి కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు, ” నీవు ఇండియాలో నివసించాల్సిన అవసరం లేదు, వేరే దేశాలను ఇష్టపడే నువ్వు ఇక్కడే ఎందుకు ఉంటున్నావు? వేరే ఏ దేశంలో ఐన నివసించు అంటూ ట్వీట్ చేసాడు. తర్వాత ఆ వ్యాఖ్యల పై పెద్ద దుమారమే రేగింది.