సన్ రైజర్స్ సిద్దార్థ్ చెత్త రికార్డు!

Monday, May 28th, 2018, 10:30:48 PM IST

ఈ ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు నమోదయినట్టే. చెత్తరికార్డులు కూడా బాగానే నమోదయ్యాయి. ఎన్ని చెత్త రికార్డులు నమోదయినప్పటికీ ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది మాత్రం అత్యధిక పరుగులు సమ్పరించుకున్న వారి గురించే. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ – చెన్నై మంచి ఆట తీరుతో ఫైనల్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే టీమ్ లోని ఆటగాళ్లు ఈ సారి అత్యధిక పరుగులు సమర్పించుకున్నారు.

సన్ రైజర్స్ ఆటగాడు సిద్దార్థ్ కౌల్ 547 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ మొత్తంలో ఇదే చెత్త రికార్డ్. అలాగే చెన్నై ఆటగాడు డ్వేన్ బ్రావో అత్యంత పరుగులు ఇచ్చిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 2013(494) – 2016 (494) లో కూడా బ్రావో భారీ పరుగులను ఇచ్చిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్ లో బ్రావో 533 పరుగులు ఇచ్చాడు. వారి తరువాత స్థానంలో ఉమేష్ యాదవ్ ఉన్నాడు. 2013లో ఉమేష్ 508 పరుగులు ఇవ్వగా 2017 లో మెక్లీన్‌గన్‌ 507 పరుగుకు ఇచ్చి నాలుగవ స్థానంలో నిలిచాడు.