చంద్రబాబులో అభద్రతా భావం..?

Friday, November 9th, 2018, 09:36:03 AM IST

చంద్రబాబు 2019 ఎనికల్లో ఓడిపోతారని పలు జాతీయ సర్వేలు తేల్చేశాయి, అంటే 2019లో జగన్ సీఎం అవబోతున్నాడని ఆ సర్వేల రిజల్ట్, అక్కడ మొదలైంది చంద్రబాబులో అభద్రతా భావం. ఒకవేళ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి జగన్ సీఎం అయ్యాడంటే, టీడీపీ పరిస్థితి ఏంటో బాబుకు బాగా తెలుసు. అందుకే బాబు ఈ మధ్య రక రకాలుగా మాటాడుతున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి గెలిస్తే, అది తమ గెలుపే అన్నంత హడావుడి చేస్తున్నాడు. కాంగ్రెస్ – జెడీఎస్ ల కూటమి సెట్ అవటానికి తనే కారణం అయినట్టు గొప్ప చెప్పుకుంటున్నాడు. మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన విషయం ప్రజలు అపుడే మర్చిపోరు. చంద్ర బాబు మల్లి ఇపుడు కారాన్తక వేదికగా రాజకీయం మొదలు పెట్టారు.

కేంద్రం లో బీజేపీయేతర పార్టీలన్నిటిని ఏకం చేసే దిశగా జెడీఎస్ పెద్దలతో చర్చలు జరుపుతారట. పైకి అలా చెప్తున్నా, ఈ భేటీ వెనక అసలు కారణం వేరే ఉందట. రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ స్థిర పడ్డ కన్నడిగులు ఓట్లు టీడీపీకే వేసేలా చేయమని వారితో ఒప్పందం చేసుకునేందుకే అయన బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కెసిఆర్ తో సన్నిహితంగా ఉన్న జెడీఎస్ తెరాసని కాదని టీడీపీ కి మడ్డస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. చంద్రబాబులో ఈ మధ్య అభద్రతా భావం చాలా పెరిగినట్టు కనిపిస్తుంది, హైదరాబాద్ తన కష్టార్జితంగా చెప్పుకుంటాడు, కర్ణాటక – జెడీఎస్ ల పొత్తు తానే సెట్ చేసినట్టు గొప్ప చెప్పుకుంటున్నాడు ఈ వ్యాఖ్యలన్నీ ఆయనలో అభద్రతా భావం వల్ల పెరిగిన అసహనం వల్ల చేసినవే పలువురు అభిప్రాయపడుతున్నారు.