కేసీఆర్ కేబినెట్ లో విప్లవం..బాబుకు కూడా తప్పదా..!

Tuesday, January 16th, 2018, 04:32:56 PM IST

పిరాయింపులకు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు అతీతం కాదు. కేవలం పలుకుబడి ఉంటె చాలు ప్రజామోదం లేకున్నా ఏకంగా కేబినెట్ మంత్రులుగా రాజ్యం ఎలవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల కేబినెట్ లో ఇదే పరిస్థితి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని తెలుగులో ఓ సామెత ఉంది. దశాబ్దాలుగా పార్టీలని అంటిపెట్టుకుని ఉన్నా నేతల కంటే ఇద్దరి చంద్రులకు దోడ దూకి మరి వచ్చిన ఫిరాయింపు నేతలు ఎక్కువైపోయారు. ఉప్పూకారం తిన్న తెలుగు నేతలు దీనిని ఎంతకాలం భరిస్తారు. తమకు దక్కాల్సిన అందలం వేరొకరు ఎగరేసుకుపోతుంటే ఊరుకుంటారా.. దీనిపై రివల్యూషన్ రాక తప్పదు. ఇప్పటికే మొదలైపోయింది కూడా..టిఆర్ ఎస్ నేతలు వరుసగా దీనిపై అసంతృపి వ్యక్తం చేస్తుండడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తలనొప్పి వ్యవహారంలా మారింది.

ఓ ఇద్దరు టిఆర్ఎస్ కీలక నేతలు చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ ఉద్యమం తో ఎలాంటి సంబంధం లేని వారుకూడా కేబినెట్ లో దర్జాగా కూర్చుంటున్నారని నాయని నరసింహారావు డైరెక్ట్ గా అనేశారు. దీనితో కేసీఆర్ లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది. నాయని వ్యాఖ్యలు సైకిల్ దిగి కారు ఎక్కినా వారిపైనే అని స్ఫష్టంగా అర్థం అవుతోంది. ఇలాంటి నిరసన స్వరాలు మరో మారు వినిపించకుండా త్వరలో చేయబోతున్న కేబినెట్ విస్తరణలో సైకిల్ నేతలని తప్పించి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన టిఆర్ ఎస్ నేతలకు పెద్ద పిట వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇక ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో ఈ తరహా వ్యవహారం ఏం తక్కువ కాదు. సైకిల్ పార్టీ కేబినెట్ లో వైసిపి ఫ్యాను బాగానే తిరుగుతోంది. ఆదినారాయణరెడ్డి, అఖిల ప్రియ వంటి ఫిరాయింపు మంత్రులు చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఏంటి బాబు ఇది అని ఇదివరకే గగ్గోలు పెట్టారు. ఆ సమయానికి చంద్రబాబు ఎలాగో మేనేజ్ చేశారు. ఎంతకాలం ఇలా నెట్టుకు రాగలరు. కేసీఆర్ కు ఎదురైన సమస్యే చంద్రబాబుకు సైతం ఎదురుకావడం ఖాయం అని అంటున్నారు.