మూవీ రివ్యూ : సింబా

Friday, December 28th, 2018, 02:37:50 PM IST

బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ జంట‌గా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ చిత్రం సింబా. జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిల‌చిన‌ టెంప‌ర్ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి తెలుగులో సెన్సేష‌న్ హిట్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

కథ :

సంగ్రమ్‌ భాలేరావ్‌ అలియాస్‌ సింబా (రణ్‌వీర్‌) ఓ క‌రెప్టెడ్ పోలీస్. కేవ‌లం డ‌బ్బు సంపాదించ‌డానికే పోలీసు ఉద్యోగంలో చేరుతాడు. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ డ‌బ్బుసంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న సింబాకి.. వైధ్య విద్యార్ది అయిన స‌గున్ (సారా అలీ ఖాన్‌) ప‌రిచ‌యం అవ‌డం, వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం కథ సాఫీగానే సాగుతోంది. అయితే ఈ క్ర‌మంలో స‌గున్ ఫ్రెండ్ ఆకృతి (వైదేహి పరశురామి) కూడా సింబాకి స్నేహం ఏర్ప‌డుతుంది. ఇక అక్క‌డే దుర్వా (సోనూసూద్‌) అర‌చ‌కాలు సాగుతూ ఉంటాయి. ఒక‌రోజు దుర్వా సోద‌రులు ఆకృతిని కిడ్నాప్ చేస్తారు. దీంతో క‌థ ఊహించ‌ని మ‌లుపు తిరుగుతుంది. మ‌రి ఆకృతిని దుర్వా సోద‌రులు ఎందుకు కిడ్నాప్ చేశారు.. దుర్వా సోద‌రులకు ఆమెకు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి.. సింబా క‌రెప్టెడ్ పోలీస్ అయిన సింబా త‌న ల‌వ‌ర్ స్నేహితురాలిని కాపాడుతాడా.. తెలియాలంటే ఈసినిమాని వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ :

సింబా కథ టెంప‌ర్ రీమేక్ అయినా క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రం మొత్తం ర‌ణ్‌వీర్ వ‌న్ మ్యాన్ షోగా సాగింది. చిన్న చిన్న మార్పుల‌తో కొన్ని హంగులు అద్దినా అవి సెట్ కాలేదు. యాక్ష‌న్ పార్ట్ రోహిత్ శెట్టి స్టైల్‌లో ఉన్న మ‌ధ్య‌లో అన‌వ‌స‌రంగా కామెడీ చేయ‌డానికి ట్రై చేసి స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ సినిమాని త‌ల‌పిస్తారు. ర‌ణ్‌వీర్ మాత్రం త‌న‌దైన న‌ట‌న‌తో రెచ్చిపోయాడు. ఒక‌వైపు హీరోయిజాన్ని చూపిస్తూ.. మ‌రోవైపు కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. ఇక‌ వచ్చీ రాని ఆంగ్లంలో రణ్‌వీర్‌ చెప్పే డైలాగ్స్ థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయిస్తాయి. సారా అలీ ఖాన్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోయినా.. చాలా ప్రెష్‌గా క‌నిపించింది. ఇక సోనుసూద్ డ‌మ్మీ విల‌న్‌గా ప్ర‌కాష్‌రాజ్‌ను బీట్ చేయ‌లేక‌పోయాడు. ఇక అజ‌య్ దేవ్‌గ‌న్ ఎంట్రీ మాత్రం అదిరోపోయింద‌నే చెప్పాలి. అలాగే అక్షయ్‌ కుమార్, తుషార్ ‌కపూర్‌, కునాల్‌ ఖేము, శ్రేయాస్‌ తల్పాడే, అర్షద్‌ వార్సి, కరణ్‌ జోహార్‌ ఓ పాటలో మెరిసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తారు.

ఫ్ల‌స్ :

రణ్‌వీర్‌ సింగ్‌

నిర్మాణ విలువలు

అజయ్‌ దేవగణ్‌ కేమియో

మైన‌స్ :

లాజిక్ లేని క‌థ‌నం

ద‌బాంగ్ ఛాయ‌లు

తీర్పు :

టెంప‌ర్ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈచిత్రం హీరోయిన్‌తో రొమాన్స్.. విలన్లతో పోరాటం.. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్.. నిజాయితిగల పోలీస్ ఆఫీసర్‌గా మారే ఎమోషన్స్ సీన్స్ అన్నీ టెంపర్‌ నుండి కాపీ కొట్టినవే. అయితే తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్ మాసీవ్ టేకింగ్ టెంప‌ర్ సినిమాని ఓ రేంజ్‌లో నిలిపితే.. సింబాలో మాత్రం ఓవ‌ర్ కలర్ అద్దిన‌ రోహిత్.. టెంప‌ర్ మూవీ స్థాయిని అందుకోలేద‌నే చెప్పాలి. సినిమాలో కీలక‌మైన ఇంటెన్సిటీని మిస్ చేయ‌డంతో ప్రేక్ష‌కులు ఏదో తెలియ‌ని అసంతృప్తికి గురి అవుతారు. మ‌రి ఈ సినిమాకి పోటీగా ద‌గ్గ‌ర‌లో ఏ పెద్ద చిత్రం లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి.

రేటింగ్ : 3/5

తెలుగు ఇన్ పంచ్ లైన్ : ర‌ణ్‌వీర్ వ‌న్‌మ్యాన్ షో

REVIEW OVERVIEW
Simmba Telugu Movie Review