సింగం 3 ఫస్ట్ డే టాక్ ఎలా ఉంది..?

Thursday, February 9th, 2017, 10:20:16 AM IST


సూర్య నటించిన సింగం 3 చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఈ చిత్రం ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుంది. సింగం సిరీస్ లో వచ్చిన తొలి రెండు భాగాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పించాడు. తొలిరెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి నే మూడో భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. దీనితో ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ? తొలి రెండు భాగాలను మించేలా ఉంటుందా ? అనే ఆసక్తి ప్రతిఒక్కరిలో నెలకొని ఉంది.

చాలా ప్రాంతాల్లో ఈ చిత్ర ఫస్ట్ షోలు పూర్తయ్యాయి. పబ్లిక్ టాక్ ని బట్టి ఈ చిత్రం తమిళనాడులో పర్వాలేదనిపించే విధంగా ఉందని అంటున్నారు. కానీ ఓవర్సీస్ లో మాత్రం బాగా మిక్స్డ్ టాక్ వస్తోంది. తొలిరెండు భాగాల్లాగే దీనిలోనూ దర్శకుడు ఇంటర్నేషనల్ మాఫియాని ఇంటరాగేట్ చేయడం వంటి సీన్లని హైలైట్ చేసినట్లు తెలుస్తోంది.కానీ యాక్షన్ డోస్ ని మరింత పెంచేశాడని అంటున్నారు. దీనితో ఈ చిత్రం అన్నివర్గాలను ఆకట్టుకోగలుగుతుందా? అనేది ఆసక్తిగా మారింది. సూర్య అభిమానులకు మాత్రం నచ్చే అవకాశం ఉన్నా జనరల్ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందనేది తేలాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు మినహా మిగతా ఏరియాల్లో డివైడ్ టాక్ వస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఆర్థిక ఇబ్బందుల వలన ఇంకా షో లు మొదలుకాలేదు.