రియాలిటీ షోలు వచ్చాక అవి జరుగుతున్న సమయంలో వాటిలో పాల్గొంటున్న వ్యక్తులు ఒక్కోసందర్భంలో శృతి మించడం అక్కడక్కడా కొన్ని వున్నాయి. అయితే డిజిటల్ విప్లవం పుణ్యమా అని ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం ఇప్పుడు నెట్టింట్లో క్షణాల్లో అప్లోడ్ అవుతోంది. దీనివల్ల నష్టం ఎంత ఉంటోందో ఒకింత లాభం కూడా అంతే ఉంటోంది. ఎందుకంటే ఆ వీడియోల్లో ఏమైనా తప్పులుంటే ఇట్టె దొరికిపోవడం జరుగుతోంది. అయితే ఇటీవల ఇటువంటి ఘటన ఒక రియాలిటీ షో వేదికగా జరిగింది.
బర్ఫీ, బే ఫికర్ ,సుల్తాన్, దమ్ లగాకే హైషా తదితర చిత్రాల్లోని పాటలను పాడిన సంగీత దర్శకుడు, గాయకుడు పపోన్ ఇటీవలి జరిగిన ఒక మ్యూజిక్ రియాల్టీ షోలోఓ మైనర్ బాలికను ముద్దుపెట్టుకుని అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు బాలిక పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. కాగా పపోన్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు న్యాయవాది రుణ భుయాన్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ది వాయిస్ ఇండియా కిడ్స్ అనే షోకు గాయకులు షాన్, హిమేశ్ రేష్మియా లతో కలిసి పపోన్ న్యాయనిర్ణేతగా వ్యహరిస్తున్నారు. ఇందులో భాగంగా రంగ్ బర్సే అనే హోలీ పాట ఆలపించిన అనంతరం అక్కడ వున్న బాలిక దగ్గరకు వెళ్లి ఆమెకు రంగులు పూసి వెనువెంటనే ఆమెని ముద్దాడాడు పపోన్. ఈఘటన పై రుణ భుయాన్ బాలల హక్కుల సంరక్షణ పీవోసీఎస్వో కింద పపోన్పై ఫిర్యాదు చేశారు.
పపోన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఓ మైనర్ బాలికతో గాయకుడు పపోన్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్కు గురి చేసిందని అన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత దేశంలోని రియాల్టీ షోలో పాల్గొంటున్న మైనర్ బాలికల రక్షణ, భద్రత విషయంలో చాలా బాధపడ్డ నేను బాలికలకు ఈ షోల్లో వ్యవహరించవలసిన తీరుపట్ల సూచనలు ప్రభుత్వం జారీ చేస్తే బాగుంటుందని రుణ భుయాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయమై పపోన్ ఇంకా స్పందించలేదు…