ఆ హోట‌ల్లో ఓ అంద‌మైన అమ్మాయి ఉంది.. క‌న్నేసిన క్రికెట‌ర్ మ‌లింగా ఏం చేశాడు.. సంచ‌ల‌నం రేపుతున్న సింగ‌ర్ చిన్మ‌యి పోస్టు..!

Friday, October 12th, 2018, 06:35:32 PM IST

చిత్ర పరిశ్ర‌మ‌లో ఆడ‌వారి పై జ‌రుగుతున్న లైంగిక వేధింపు అంధాల భామ‌లు ఏక‌రువు పెడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల ఈ లైంగిక వేధింపులు స‌మ‌స్య పై చ‌ర్చ‌లు జ‌ర‌గుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుట్ హాట్ బ్యూటీ త‌ను శ్రీ ద‌త్తా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూని తెర పైకి తేవ‌డంతో.. అనేక మంది తారలు ఆమెకు మ‌ద్ద‌లు తెలిపారు. వారి త‌మిళ్ సింగ‌ర్, డ‌బ్బంగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీపాద కూడా ఉన్నారు.

అయితే తాజాగా చిన్మ‌యి త‌న‌కు ఎదురైన లైంగిక వేధింపులు గురించి చెప్పి పెద్ద షాకే ఇచ్చింది. త‌న‌కు ఎనిమిదేళ్ళ‌ప్పుడే లైంగిక దాడి జ‌రిగింద‌ని త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి పెద్ద ర‌చ్చే లేపింది చిన్మ‌యి. అయితే ఇప్పుడు మ‌రో భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది చిన్మ‌యి. అయితే ఆ యువ‌తి వివారాలు మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. ఇక అసలు విష‌యంలోకి వెళితే.. ఐపీఎల్ లీగ్ సంధ‌ర్భంగా ఒక అమ్మాయి హోట‌ల్‌లో దిగ‌గా.. ప‌క్క రూంలోనే ఉన్న శ్రీలంక క్రికెట‌ర్ మ‌లింగ ఆ అమ్మాయి పై లైంగిక దాడి చేశాడ‌ని చెప్పి పెద్ద సంచ‌ల‌న‌మే రేపింది చిన్మ‌యి.

అస‌లు విష‌యం లోకి వెళితే ఒక‌రోజు త‌న స్నేహితురాలికోసం స‌ద‌రు యువ‌తి ఎదుఉ చూస్తుండ‌గా.. ఒక‌రు వ‌చ్చి ఆమె మ‌లింగ గ‌దిలో ఉంద‌ని చెప్పారు. దీంతో వెంట‌నే అక్క‌డికి వెళ్ళగా…వెనుక‌నుండి మ‌లింగా త‌న‌ని బెడ్ పై తోసి చెప్ప‌లేని చోట చేతులు వేసి త‌డిమాడు. ఇక నాకు ప్ర‌తిఘ‌టించే శ‌క్తి లేక గ‌ట్టిగా క‌ళ్లు మూసుకొని ఉండిపోయాను. అప్పుడు హోట‌ర్ స్టాప్ వ‌చ్చి డోర్ కొట్ట‌డంతో నేను త‌ప్పించుకున్నాను. దీంతో దేవుడి ద‌య‌వ‌ల్ల ఆరోజు అత‌ని భారి నుండి త‌ప్పించుకున్నాన‌ని చెప్పింది స‌ద‌రు య‌వ‌తి. అయితే మ‌లింగ పెద్ద సెల‌బ్రిటీ కావ‌డంతో తాను కావాల‌నే ఆ గ‌దిలోకి వెళ్ళాన‌ని అంద‌రూ అనుకుంటారు.. ఏవ‌రు ఏమ‌నుకున్నా స‌రే అని ఆ బాదిత యువ‌తి ట్వీట్ చేయ‌గా.. చిన్మ‌యి మీ..టూలో పోస్టు చేసింది. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది.