గజల్ శ్రీనివాస్ అరెస్ట్..అమ్మాయితో మసాజ్..!

Tuesday, January 2nd, 2018, 12:16:38 PM IST

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ భారీ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ ని పంజా గుట్ట పోలీస్ లు అరెస్టు చేసారు. గజల్ శ్రీనివాస్ ఓ యువతి లైంగికంగా వేధిస్తూ ఆమె చేత మసాజ్ చేయించుకుంటున్న వీడియో సంచలనంగా మారడంతో పోలీస్ లు అతడిని అరెస్టు చేసారు. దీనిపై మీడియాతో మాట్లాడిన గజల్ శ్రీనివాస్ తనకు ఏ పాపం తెలియదని అంటున్నారు. ఆ వీడియో వాస్తవమే అని కానీ అందులో తప్పుగా ఏమిలేదని ఆయన తెలిపారు.

ఇటీవల తనకు యాక్సిడెంట్ అయిందిందని చికిత్స అనంతరం రోజు రోజు ఫియోజి థెరపిస్ట్ వచ్చి తనకు మసాజ్ చేసేవారని శ్రీనివాస్ తెలిపారు. కానీ ఆరోజు ఫియోజి రాలేదు. తనకు ఫియోజి థెరపీ వచ్చని, మసాజ్ చేస్తానని ఆ అమ్మాయి ముందుకు వచ్చినట్లు శ్రీనివాస్ వివరించారు. తాను వద్దని వారించినా ఆ యువతే చేసిందని, కానీ ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం దారుణం అని వాపోతున్నాడు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ లాయర్ బెయిల్ కోసంపిటిషన్ వేయగా దానిని కోర్టు కొట్టివేసి షాకిచ్చింది.